STORYMIRROR

VENKATALAKSHMI N

Romance Fantasy Others

3  

VENKATALAKSHMI N

Romance Fantasy Others

యువరాణి

యువరాణి

1 min
199

అందానికి అందంతో

సాటిరాని సింగారంతో

జుంటితేనయ మకరందంతో

పూల సామ్రాజ్యానికే

మకుటం లేని మహారాణినంటూ

మగువల మనసు దోచి

బొకేలతో పలువురిని ఆకర్షించి

కులుకుల తో హొయలొలుకుతూ

మురిపెంగా మురిసిపోతూ

"ఉషోదయం"పలుక వచ్చిన

ఓ గులాబి!

ప్రేమకు ప్రతీకగా

ప్రేమికుల హృదయాలను

కొల్లగొడతావు

కంటకాల కవచాలతో

చిరునవ్వుల పరిమళాలు

పంచుతావు

ఆస్వాదించే మనసున్న

వారికి గులాం అవుతావు

మగువల జీవితానికి

ఆదర్శంగా నిలిచావు

అందుకే ఓ గులాబీ

అందుకో ఈ జవరాలి జోహార్లు...


Rate this content
Log in

Similar telugu poem from Romance