STORYMIRROR

తాళ్ళ శ్రీ

Romance Action Classics

4  

తాళ్ళ శ్రీ

Romance Action Classics

నువ్వో అబద్దం

నువ్వో అబద్దం

1 min
304

నా హృదయ‌ నిఘంటువులో...

ప్రేమ అనే పదానికి అర్దం

నీ పేరే అనేంతలా...

నిన్ను నాలో నింపేసుకున్న


నువ్వు నా కోసమే

అనే భావాన్ని మోస్తున్నంతసేపు 

అది ప్రణయపు మోహామో

విరహాపు భారమో తెలియని 

ఊహల్లో తేలియాడుతున్న


కౌమారపు ఊహల నుంచి

యవ్వన ఆలోచన వరకు

నువ్వో పరిహాసపు ప్రణయినివని

నా హృదయాంధకార మందిరంలో

ప్రేమ జ్యోతులు వెలిగించిన సిరివి అని

నాలో నేను మురిసిపోయా...


నా నువ్వంటూ... లేకుంటే 

అనే ఆలోచనలు

నన్ను అగాథంలోకి తోసేస్తుంటే

నేనో శూన్యం అనుకున్నా

కాని నిజం చెప్పాలంటే

నువ్వో అబద్దం అని తెలిసింది 

అబద్దం అంటే అదో భ్రాంతి 

నా ఊహల ప్రవాహంలో 

అద్భుతంగా అనిపించిన 

కలల అలవు మాత్రమేనేమో అని

నా నుంచి దూరమైపోతున్న

నీ గురించిన ఆలోచనలు చెబుతున్నాయి


ప్రేయసి నువ్

కనులలోని కన్నీరులా నేల రాలి 

కనుమరుగైనట్టు

నా ధ్యాస నుంచి విముక్తి చెంది 

ప్రేమ శ్వాస ఆడక 

ఆమాంతం అదృశ్యమయ్యావే


 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance