STORYMIRROR

తాళ్ళ శ్రీ

Romance Fantasy

3  

తాళ్ళ శ్రీ

Romance Fantasy

కొత్తగా పరిచయం అవుతున్న

కొత్తగా పరిచయం అవుతున్న

1 min
224

ఎన్నెన్నో అన్వేషణల కొరకు తపించిపోయే యవ్వనంలో

ఎప్పుడు ఏదో...ఒక ఆలోచన

ఉత్సాహపు ఉరుకులా

నిరుత్సాహపు నిద్రలా

తటస్థ భావాలు

అల్లకల్లోలపు ఆవేదనలు

అన్ని క్షణ కాలపరిమితిలో...వస్తూ...పోతుంటాయ్

కానీ అన్నింట్లోను నీ తలంపు మాత్రం

ఓ మెరుపులా మెరిసి

ఓయ్ నన్ను మరవద్దు అన్నట్టు

ఓ చూపు చూసి వెళ్లిపోతావ్ 

మళ్ళీ నా అంతరంగం

మరొక విషయాలోచనలో 

సరికొత్త శోధన మొదలెడుతుంది

ఎన్ని భావావేశాలు నాలో...కలిగినా 

నీ గురించిన ఊహ వస్తే...చాలు

నాలో...పరిపక్వత లేని పసితనమో

ఎన్నడు అనుభవించని వివశత్వమో

ఏదో...తెలియని సంభ్రమాశ్చర్యమో 

నన్ను నాలో లేకుండా చేస్తూనే ఉన్నాయ్

ఏదేమైనా కానీ నీ ప్రతి పలకరింపుతో

నాకు మాత్రం నేను కొత్తగా పరిచయం అవుతున్న 


Rate this content
Log in

Similar telugu poem from Romance