STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ప్రేయసి

నా ప్రేయసి

1 min
401

ప్రేమపూలు వర్షించే..మేఘంలా నా ప్రేయసి..!

మదిలోయల గమకాలకు..రాగంలా నా ప్రేయసి..!


అక్షరాల పల్లకిలో..నవవధువై సిగ్గులొలుకు..

తెఱతొలగని పరువాలకు..అందంలా నా ప్రేయసి..!


లాస్యవీణ తంత్రులలో..నాట్యమాడు కోమలియే..

కడలియలల నురగలింటి..హాసంలా నా ప్రేయసి..!


పరుగుతీయు సెలయేటికి..సొగసులెన్ని ఇచ్చేనో..

పరవశించి ప్రవహించే..గీతంలా నా ప్రేయసి..!


తాపాలకు ఊయలైన..తనువదెంత గొప్పగురువు..

తలపులెల్ల పండించే..గగనంలా నా ప్రేయసి..!


స్వప్నచిత్ర సీమనేలు..సరసమౌన వాహినియే..

మాటలకే చోటివ్వని..ప్రాణంలా నా ప్రేయసి..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance