విస్మరించేనే
విస్మరించేనే
వెళ్లే దారుల్లో
పువ్వుల తీవాచి
కొత్త బాణీల స్వర నాదం
వేచి చూస్తున్న పూదోట
సీతకోకచిలుకల సమూహం
కుహు కూహూల గానామృతం
తుమ్మెదల ఝుంకారాలు
సకల ప్రాణుల ఆనందోత్సాహాలు
ప్రకృతి నిదురలేచి
ఆ సూర్య కిరణాల తాకిడితో
ఉత్తేజం పొందుతూ
నీ నుంచి జనియించి
నిను విస్మరించేన...!
అన్నీ నీ కనుసన్నల్లో
నీ రాకకై
నిను వేకువ జామున మేల్కొలప
నీ పూజ కై
వేచి ఉన్నాయి
నువ్వు ఇచ్చిన ఈ జన్మ అనే కానుక
నిను తలచనె ,
నిను కొలువనె,
నిను చూడడానికె
నిను చేరడానికె
సకల ప్రాణికోటి రహస్యం
పుట్టి -గిట్టడం
నిను చేరి
తరించుట కొరకే.

