నీ జ్ఞాపకాలు
నీ జ్ఞాపకాలు
నీ జ్ఞాపకాలు
మల్లెల సుగంధాలై
అల్లరి చేస్తున్నాయి..
అలసిన మనసు
కలుసుకోవాలనీ
వెసులు బాటు
చేసుకొని ఊసులూ
కలబోసుకోవాలనీ...
తప్పులు ఒప్పుకోవాలని
మెప్పులు చెప్పుకోవాలని
మది నొప్పులు పంచుకోవాలనీ,
బంధానికి బంధువులమై చూపులతో
చుట్టేసుకుంటూ...
అధరాన నవ్వుల పువ్వులు
పూయించుకుంటూ...
కదిలిపోయే క్షణాలను
అందమైన పందిరిలా
అల్లుకుంటూ జీవితాన్ని
నందనవనంగా
మలుచుకుందాము కలగానినిజమై
....✍️ సిరి

