ఎదురు చూపులో
ఎదురు చూపులో
ఎదురుచూపుల ఫలం దక్కిందనుకున్నా
నీకై నువ్వే వచ్చావనుకున్నా
మురిసి తబ్బిబ్బయ్యా
ఎడబాటుకు రుణం తీరిపోయిందనుకున్నా
నన్నొదిలి పోలేవనుకున్నా
నేల విడిచి గాలిలో తేలిపోయా
నీ కాలక్షేపం తీరిపోయిందనుకున్నావనుకున్నా
అగాధంలో వున్నా పట్టలేదు
తిరిగైనా చూడలేదు
నీ కవసరంలేకుండా పోయాననుకున్నా
కబురైనా పంపలేదు
ఓ నవ్వైనా కురిపించలేదు
నువ్వైనా ఆనందం గా ఉండాలని కోరుకున్నా
నే గుర్తు లేకున్నా పర్వాలేదనుకున్నా
నీ క్షేమమే సదా నేనాశించాను నేనెలవున్నా....

