ప్రేమ 💟💟
ప్రేమ 💟💟
చెలికాడు,
మేఘమాల నింగిలో
సందర్శిస్తూ
భువిలో త్రొంగి చూస్తూ
అలవోకగా తలాడిస్తూ
వర్షపు జల్లు రాల్చినట్లు
నెచ్చలిని గాంచె.
చెలియ సిగ్గు మొగ్గయై,
కుదించిన చిరునవ్వుతో
గాంచె, జాలరి వలలో
చిక్కుకొన్న చేపలా,
హృది ఎగసిపడ,
స్వేద బిందువులు మదిని
తడిపేస్తూ నేస్తం
చిరునవ్వుతో మురిసిపోయె,
భావ వీచికలు ఉవ్వెత్తున
లేచి లలనను జలకమాడించె.
ప్రేమ మధురిమ పరవళ్లు త్రోక్కి
ఊహా జగత్తులో విహరిస్తూ
విన్నూత భావాలతో పులకరించె.
ప్రేమ ఆరాధన ఇరు
హృదయాలను పెనవేసె...

