జ్ఞాపకమా
జ్ఞాపకమా
అయస్కాంత శక్తిపూల..తోట నీవు జ్ఞాపకమా..!
విరహమసలు ఓపలేవు..కాల్చనీవు జ్ఞాపకమా..!
ప్రేమ అనే విషము పట్ల..మోజెందుకు పెంచినావు..
నీవులేక క్షణం గాలి..పీల్చనీవు జ్ఞాపకమా..!
చిత్రపటం పెట్టే ఈ..చిత్రహింస విచిత్రమే..
వియోగాన సుఖమేదో..చూడనీవు జ్ఞాపకమా..!
ఎంత మధురమైన నేమి..ఇప్పుడేమి అవసరమట..
వర్తమానపు క్షణములోన..బ్రతుకనీవు జ్ఞాపకమా..!
నిను వీడక హాయన్నది..లేదన్నది తోచదాయె..
పారిజాత పరిమళాల..మేడ నీవు జ్ఞాపకమా..!

