ఎదవాకిట నీకోసం
ఎదవాకిట నీకోసం
పట్టపగలు జాబిలివై..వస్తావని చూస్తున్నా..!
నీ జతలో ఆవేదన..తీరాలని చూస్తున్నా..!
ఎదవాకిట నీకోసం..ఎదురుచూపు వరమేలే..
పారిజాతమీ మనసే..ఇవ్వాలని చూస్తున్నా..!
మేలమాడుతూ వెళ్ళే..నీలిమబ్బు దండుచూడు..
మనకోసం పసిడివాన..కురవాలని చూస్తున్నా..!
తాపానికి ఆజ్యమింత..పోసేవా సూర్యునిలా..
విషయ రాగవీణ మదిని..మీటేవని చూస్తున్నా..!
తనువులనే మరపించే..లోకంకద స్వర్గమంటె..
నీ భుజమున వాలినంత..దక్కేనని చూస్తున్నా..!
కరిగిపోవు కాలంతో..పేచీయే మిగులుతోంది..
ఈ వసంత విరహాగ్నిని..ఆర్పేవని చూస్తున్నా..!

