STORYMIRROR

తాళ్ళ శ్రీ

Fantasy

4  

తాళ్ళ శ్రీ

Fantasy

నీకై ఆరాటం

నీకై ఆరాటం

1 min
276

ప్రేమకై ఆరాటం...ఎందుకో తెలియదు 

కానీ అనుక్షణం ఆనందపు మైకాన్ని

అనుభవించాలని పరితపిస్తుంది మది


ఎన్నో భావనలతో...

అంతరంగంలో...జరిగే సంఘర్షణలన్ని

ఏ సాంత్వన కోసం ఎదురుచూస్తున్నాయేమో కానీ

నీ ఒక్క తలంపుతో‌...

నాలో నిండిన నైరాశ్యమంతా పలాయనమైపోయి

ఉత్సాహపు ఊహల ఊయల ఊగేస్తున్న


నువ్వంటే...ఎవరో కూడా పరిచయం లేదు 

నీ రూపాన్ని నా అక్షాలు స్పర్శించను లేదు

అయినా నీ బొమ్మను నా ఎదలో ముద్రించుకున్న

కలలోని నిన్ను తనివితీరా వీక్షించి 

యిలలో నీకై తపనతో ఎదురుచూస్తున్న


నువ్వు వస్తావని చిన్ని ఆశ కాదు

నాలో ప్రేమపై ఉన్న గట్టి నమ్మకం

నువ్వు నాతో కలుస్తావని కాదు

నీలో నన్ను కలిపేసుకుంటావనే అభిలాష

ప్రేమించాలంటే పరిచయమవ్వాల్సిన అవసరం లేదు

ప్రేమను పంచుటలో...నిన్ను విసిగించే అవకాశం తీసుకోను

అయినా కూడా నువ్వు నా ఇష్క్ ని స్వీకరిస్తావని నమ్మకంతో... నీకై ఎదురు చూసే మది



Rate this content
Log in

Similar telugu poem from Fantasy