STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy

ఆకాశంలో ప్రేమై మోలకెత్తుతా

ఆకాశంలో ప్రేమై మోలకెత్తుతా

1 min
568

నీ మీద నా ఫీలింగ్స్ వాటంతట అవే 

ఉప్పెనలా ఎగిసి పడుతున్నాయి, 

ఏమని తెలుసా?

నీ చిరునవ్వు ఏ మనసుని దోచేస్తుందో...

నీ రూపం ఏ మనిషిని ఆకట్టుకుంటుందో...

నీ మాట ఏవరిని బందిస్తుందో...

ఎవరికీ తెలుసు...!!

నీ నవ్వులతో రువ్విన పువ్వులు 

నా కురులలో ఇంకా పరిమాళాలు 

వేదజల్లుతూనే ఉన్నాయి......ఎందుకంటే

నీ ఊహలతో ఊపిరి పోసుకున్న నా మనసు

ఆ విరులను ఎన్నటికి వాడనియ్యవు.....


ప్రతి ఉషోదయం మోసుకోచ్చిన నీ ఊసులు 

విన్న తరువాత ప్రతి ఉదయం నా నేస్తమైపోయింది...

ముసుకున్న కళ్ళల్లో నీవు తీసుకొచ్చిన

స్వప్నాలతో ప్రతి రాత్రి నా ప్రియ సఖుడిగా మారింది

కొన్ని ఉదయాలు కొన్ని రాత్రులు భారంగా మారాయో !ఎంత భారంగా అంటే కనులు తెరిస్తే రాత్రి నీతో 

కలల కౌగిలింతల కబుర్లు మాయమయితాయని

కనులు తెరువకుండా ఉండలనుకునే దాన్ని......

నీవు మారం చేస్తూ మళ్ళీ సూర్యుడిలా మేల్కొలుపుతుంటావు


నీ జ్ఞాపకాలల్లో చిక్కుకొని కొన్ని రాత్రులు .....

మబ్బుల చాటు చంద్రుడిలా దాగుడు మూతల

ఆటలతో కన్నీళ్లను మిగిల్చి పోయాయి

నీ జాడకోసం వేదికిన కొన్ని ఉదయాలు 

నా కళ్ళ ముందు నిశబ్దంగా కరిగిపోయాయి

మాటల వెనుక మౌనాలు, మౌనం మాటున మాటలు

కళ్ళలో దాగున్న కోరికలతో కొన్నిమధ్యాహ్ననాలు 

మంచు ముద్దలా కరిగి మరిగి అవిరులయ్యి పోయాయి


నా గుండె.....నీ గుండెలో కలిసిపోవాలని

నాకే ఎదురు తిరుగుతూ యుద్ధం చేస్తుంది

నీవు నన్ను దగ్గరకు తీసుకునే ప్రియమైన క్షణాల కోసం 

నా మనస్సు యుగాలుగా మూలుగుతుంది

నీ కోసం ఎదురు చూసేందుకు ...

ఎన్ని ఉదయాలైన మేల్కొంటా....

ఎన్ని మధ్యాహ్ననాలయిన దారులు కాస్త....

ఎన్ని నిశీ రాత్రులయిన కలలుగంట.....

ఎన్ని యుద్దాలయిన చేస్తా......

ఎన్ని యుగాలయిన ఎదురుచూస్తా....


ఉపిరిలున్నంతవరకు....

ఆ నీలి ఆకాశాన్నీ క్యాన్వాస్ చేసుకొని

నీ మీద నాకున్న ప్రేమను రాస్తూనే ఉంటా

చాలక పోతే భూమిని అరువుగా చేసుకొని, ఇంద్రధనస్సుని పెన్నుగా మార్చుకొని 

మహా సంద్రంని ఇంకుల వాడుకొని......

చెదరని జ్ఞాపకాలను రాస్తునే ఉంటా......

నా భావాలను పల్లవిలుగా, చరణాలుగా 

వినిపించి చలించని నీ హృదయాకాశంలో

మళ్ళీ ప్రేమై మోలకెత్తుతా........

********************

 



Rate this content
Log in

Similar telugu poem from Romance