శివయ్యా
శివయ్యా
#ఓయ్యో శివయ్యా.....!!
ఏమయ్యా కైలాసవాసా
చితి స్థలపు నివాసా....
నిత్యం నిన్ను తలచేనాకు
నీ దగ్గరకు రావడానికి బెరుకెందుకు అయ్యా....
చావుని ఏలే స్వామిని చేరేటప్పుడు
చావంటే భయమెందుకు స్వామీ....
నీ డమరుకాలే కదూ
మా గుండె లబ్డబ్ లు
నీ అడుగుల సవ్వడులే కదూ
మా ఆయువు పట్టులు
నీ మౌనం మాకు నరకం
నీ చిరునవ్వు మాకు అభయం...
కపాలంతో ఆడుకునే నీతో జతకట్టి
ఆ కపాలం నాది కాకూడదని కోరుకోవడం
ఎంత అవివేకం దేవా....
భస్మ ధారణ చేసే నిన్ను శరణుకోరుతూ
ఆ భస్మంలా మారడానికి నా శరీరాన్ని ఇవ్వను అనడం
ఎంత మూర్ఖత్వం ప్రభో.....
ఓయ్ భోళా శంకరా....
నేనలా చెయ్య.....
కాకుంటే.....
ముజ్జగాల నేలే ముక్కంటిని చేరేటప్పుడు
రాజసం ఉట్టిపడేలా రావాల నేను
ఏకాకిలా కాదు....
కోరిన కోర్కెలు ఈడేర్చే ఆ త్రిశూలధారుడిలో ఐక్యం అయ్యేటప్పుడు
నన్ను నేను గెలిచిన గర్వాన్ని నా పెదాలపై నిలిపివుంచుకోవాలా....
దుఃఖం పారిన మోముతో ఐక్యమవ్వకూడదు....
ఆ అర్దనారీశ్వరుడి ఓ రోమపు రూపుగా నేను అంకితమయ్యే సమయం వచ్చినప్పుడు
భవ బంధాలు జయించిన ఋషిలా ఓ వెలుగు నా కన్నులలోంచి ఆవిరి అవ్వాలా....
ఏ మాయదారి రోగానికో పడే భయం నాకంటిపాపను చేరకూడదు....
నువ్విస్తావు స్వామీ...
నాకా అనాయాస సునాయాస నీ సాన్నిధ్యాన్ని
నువ్వు పారద్రోలుతావు స్వామీ
ఈ కష్టాల కన్నీళ్ల రోజుల్ని....
అందరినుంచీ
ఈ సమస్త విశ్వం నుంచీ.....
✍️✍️సుధామురళి
