STORYMIRROR

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

వాలిన ప్రేమ

వాలిన ప్రేమ

1 min
625

సగంలో వాల్చేసిన రెక్కల్లా ఉంది బతుకు


వద్దన్నా వెలుగుతున్న కన్నీళ్లను ఏం కారణం అడగమంటావ్, రావద్దన్నా ఆగని ఆలోచనల వేడిని ఏ చలికి చుట్టబెట్టమంటావ్


రాత్రంతా కలలతో విసిగి వేసారిన రెప్పలు తెరచుకున్న తలుపుకు వారగా రాలినపడిన పువ్వుల్ని చూసి సంతోషిస్తున్నాయి, కలలిలా వాకిట్లో ముడుచుకోవడం నచ్చింది కాబోలు


అసంకల్పితంగా తెరచుకున్న మనసిప్పుడు తుప్పు పట్టిన పాత కిటికీ అయ్యింది, ఒకటే కిర్రు కిర్రులు తప్ప మూతబడటం చేతకానట్టు సతాయిస్తోంది


వద్దు పొమ్మంటున్నా వినని గాలి ఏకాంతంలోకీ దూసుకువచ్చి పారిజాత మత్తుల్ని మళ్లీ మళ్లీ అందిస్తోంది


అనిపిస్తుంది కదూ....

ఇంత పగేంటి నాపై నీకు, ఈ నీ గుర్తులకు అని.......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract