STORYMIRROR

murali sudha

Abstract Inspirational

4  

murali sudha

Abstract Inspirational

ఓటమి

ఓటమి

1 min
596

ఈ లోకం నుంచీ ఎటైనా పారిపోవాలి

అపజయాల కొండల్ని ఎన్నని ఎక్కగలం

ముగింపులేని దారుల్లో ఎందాకని నడవగలం

గురివింద బంధాలకు ఎన్ని దిష్టి చుక్కల్ని పెట్టగలం

రాళ్లన్నీ వజ్రాలే అనుకుంటూ

ఎన్ని మాటల సానల్ని పట్టగలం....


దారులేమీ మన ఒక్కరికే సొంతం కాదుగా

రెండు కాళ్ళతో రెండు కళ్లతో 

మలుపుల్ని కొలవడానికి

ముందటి ముద్రల గీతల్ని చెరపడానికి

లోకమేమీ నీకు నాకు జామీను రాలేదుగా

అద్దెకొచ్చిన మనుషుల్ని సాగనంపడానికి

అడ్డొచ్చిన మనసుల్ని మార్చి చూపడానికి


కలలిప్పుడు కాని బంధాల పల్లకీల్లో

ఊరేగేందుకు తీరిగ్గా లేవు

ఆశలిప్పుడు ప్రేమాకలిని చంపేసిన

మాయదారి మోసాల్లో మురిసేందుకు 

సుముఖంగా లేవు

కోరికలిప్పుడు చావు డప్పుల్లో అన్నా చలికాచుకుంటాయి కానీ

అబద్దాల గోడలను అంటుకునేందుకు

తిరస్కారాన్ని సంస్కారంగా మార్చుకుంటున్నాయి

మలినంగా మారలేక 

మరణాన్ని కోరుతున్నాయి.....


Rate this content
Log in

Similar telugu poem from Abstract