STORYMIRROR

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

భ్రమణి

భ్రమణి

1 min
643


ఇప్పుడీ ఇంత పెద్ద ఇంటిలో

నేనో ఒంటరి గువ్వను

తోడొచ్చిన రెక్కల్ని త్యజిస్తున్న 

మానసిక ఏకాకిని


ప్రేమల్నీ పరిచయాల్ని

మూసీలో ముంచేసి

ఉద్వేగాల్ని ఉద్దేశ్యాలని 

నలిగిన కాగితాల్లా చెత్తబుట్టలో పడేసి

నేనుగా మాత్రమే మిగిలున్న చిరు ద్వీపాన్ని


నా జీవిత రైలు ప్రయాణంలో

ఆగాలనుకుని చైన్ లాగిన సందర్భాలు చాలా తక్కువ

బహుశా లేక పోవచ్చు

దానంతట అది ఆగిన స్టేషన్ లోని ఆ కొన్ని ఘడియల్లో 

నాకేం కావాలో వెతుక్కోవడం

దొరకక వెనుదిరగడం

ఇదే ఎడతెగని కృత్యం


ప్రయాణం శూన్యం అయితే బాగుండు

ఎదురుచూపుల గమ్యాలు మరికాస్త దూరం జరిగేవి

చూపుల తీరాల్ని కోసే నిశ్శబ్దపు అలలు

అలజడుల్లోనే మాయం అయ్యేవి


రాత్రుల నిండా జాగారాలు

కనులు మాత్రం కలల నిద్రను కౌగలించుకుంటాయి

వేకువలల్లో నిశాచర తిరుగుబాటు 

కాలం మాత్రం మనసును తడిపేసి పోతుంటుంది


ఇదో జీవన భ్రమణం

పొందిన చోటులోనే కోల్పోవడం

కోల్పోయిన చోటునే తిరిగి దేన్నో వెతకడం 

   


Rate this content
Log in

Similar telugu poem from Abstract