STORYMIRROR

murali sudha

Others

4  

murali sudha

Others

తత్వేశ్వరా

తత్వేశ్వరా

1 min
336

తత్వేశ్వరా...


విపరీతాలు ఎక్కువైనప్పుడు

విమోచకుడవై ఉద్బవిస్తావు

విశ్వ క్షామాన్ని రూపుమాపేందుకు

విధ్వంసకుడిగా మారిపోతావు...


కానీ శివా....


నువ్వు భం భం భోలేనాదుడివే నాకెప్పుడూ

అలసిన నీ దేహం

నాలోని అమ్మతనాన్ని నిద్రలేపి నీకు శుశ్రూష చేయమంటుంది

సొలసిన నీ మోము

నా జీవితకాల శేషాన్ని వదిలేసి నీ చెంత చేరి నీ చెమట తుడిచే భాగ్యాన్ని పొందమంటుంది

నిదుర రాకను ఒడిసిపట్టిన నీ కనులు

నా కలలకై నిన్ను విసిగించే పొద్దును వాయిదా వేసి నీకు జోలపాడి జో కొట్టమంటూ ఊరిస్తాయి


ఆగవయ్యా...

జంగమయ్యా.....

నీకు అమ్మనయ్యేందుకు వస్తున్నా....


సుధామురళి


Rate this content
Log in