అడ్డుతెర
అడ్డుతెర
ఎంత స్వేచ్చా లోకమిది
నీలా నిన్ను బతకనీయక వెంటపడతది
ఎంత హాయైన సమాజమిది
నీ ఆనందపు అభిరుచిపై ఉక్కుపాదం మోపేస్తది
ఎంతెంత అర్దవంతపు బంధాలవి
మాటల సంకెళ్ళతో నీకో చెరసాలను సిద్ధం చేస్తవి
అడుగు అడుగుకో ప్రశ్న
సాధించగలవా నువ్వనుకున్నదని
తీరు తీరుకో సంశయం
నువ్వేర్పరుచుకున్న గమ్యం సరైనదేనా అని
ఘడియ ఘడియకో అలజడి
నువ్వెలా ఈ జీవిత సాగరాన్ని ఈదగలవని
ఇంకెక్కడ సాగుతుంది నీ ప్రయాణం
నిశ్శబ్ద యుద్ధంలో ఓడిపోతుంది
ఇంకెలా ఎదురీదుతావు కష్టాల కడలికి
బద్దలు కొట్టలేని మనసు కోటకు బంధీ ఔతూ
ఇంకెప్పటికి చేరుతావు నువ్వు కలలుకనే లోకాన్ని
ఆకులు కదలని చోట స్తబ్దుగా సాగిలపడుతూ
నీ సంఘర్షణ నీలోనే అంతం
నీ అన్వేషణ ఇకక్కడితో సమాప్తం
నీ ప్రశ్నించే ధోరణికి ఆనాడే అంతిమ దినం.....
