STORYMIRROR

murali sudha

Abstract Romance

4  

murali sudha

Abstract Romance

నువ్వు వస్తావని

నువ్వు వస్తావని

1 min
356


ఇసుక జారిపోతుంటే

అరచేయి ఎంతలా దుఃఖిస్తుందో తెలియలేదు కానీ

నువ్వు కరిగిపోతుంటే

నవ్వు చీకటౌతోంది


పక్కన్న నువ్వునప్పుడు

ఎలా ప్రవహించానో నదిలా 

లేని రెక్కలతో ఎలా విహరించానో విహంగంలా

ఇప్పుడు ఈ దూరపు పువ్వు పూసినప్పుడు

ఇద్దరి మధ్యా

వసంతం కాలిపోయినట్టుంది


కళ్లకు కాటుక ఎక్కువైనట్టు

కలలన్నీ నల్లబడిపోయాయి

దాగుడుమూతలు నిత్యమైనట్టు

ఆశలు కనిపించడం మానుకున్నాయి


సరే వస్తా....


ఇలా ఎన్నిసార్లో

మనమధ్యన దూరం దగ్గరైనా కలుసుకున్నాం కదా


అదే ఆశతో ...... 


వద్దామనే వుంది


నువ్వూ వస్తావనే వుంది




Rate this content
Log in

Similar telugu poem from Abstract