STORYMIRROR

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

గ్రహింపు

గ్రహింపు

1 min
600

గ్రహింపు....!!


ఏదో అర్థంకానితనం ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే

ఎటూ తేల్చుకోలేని ఎడారి దూరం 

మదిని మెలిపెడుతోంది

కాలానికింత నిర్దయ ఎందుకో

ప్రశ్నల శరాలు సంధిస్తూ

దిగులు జవాబులు దిద్దిస్తుంది

కొత్త దారుల్లోకి నెడుతూ

పాత పాఠాల్ని వల్లెవేయిస్తుంది


నిజమేదో

జ్ఞాపకమేదో

గమనించే వీలు లేని కళ్ళు మాత్రం

కన్నీటి వర్షాన్ని కుమ్మరిస్తూ

గుండె బరువును దించుకుంటున్నాయి

మనసు సంకెళ్లను మరింత కఠినం చేస్తున్నాయి

మరో చిక్కుముడేస్తూ జీవితం

విప్పే వీలులేక తికమక పెడుతుంటాయి


తప్పించుకు తిరిగే ధన్యతను కోరుకునే 

బుద్ధి మాత్రం.....

జఠిల వాస్తవాలను ప్రక్కకు తోసి

అడుగులకు పనిపెడుతుంది.....



సుధామురళి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract