STORYMIRROR

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

బంధం

బంధం

1 min
760

బంధం....


నువ్విప్పుడు చిరిగిన అధ్యాయానివేనా


వ్యక్తావ్యక్త 

భాషణలతోనూ

సందర్భాసందర్భ 

దూషణలతోనూ

నిన్నూ నన్నూ విడగొట్టిన కాలానికి

మన విముఖత ఓ గొప్ప బహుమతేనా


వద్దులే వదిలేసేయ్....


అతకాలనుకున్నా, గతకాలనుకున్నా

నవ్వుతున్న రోజులు కొన్ని నీకూ నాకూ మధ్య వారధులు అవ్వాలిలే

ఇప్పుడా సమయం కాదు

నీ నా దగ్గరంత తీరికా లేదు


రేపెప్పుడైనా ఎదురుపడ్డప్పుడు

ఎన్ని బాగోగుల అప్పగింతలు బతుకు మెలికల్లో మరుగున పడిపోయాయో చెప్పుకుందాం

లేదా

ఎన్ని ఈర్ష్యాద్వేషాల జంతికలు పంటి పటపటల్లో నలిగి నుజ్జునుజ్జుయ్యాయో వివరించుకుందాం


ఏంటిదీ...

ఇంత వింతగా ఉంది

దూరం అయిపోయిన నీకు నాకూ మధ్య ఇదంతా ఎందుకో కదూ

ఎందుకిలా కొత్త ఆవిష్కరణల పల్లకీలు మోస్తున్నామో కదూ 


చెప్పడానికేం లేదు....

ఏదో బంధానికి బానిసగా మిగిలామని ఒప్పుకోవడం మినహా.....


సుధామురళి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract