STORYMIRROR

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

ఏమో కదూ

ఏమో కదూ

1 min
599

ఏమో కదూ...


పెదవలా వణుకుతూనే ఉంది, ఏదో పలవరిస్తున్నట్టు, నిన్నెదో పిలిస్తున్నట్టు, ఏదీ , ఎక్కడా ఏ మౌనం కూడా వినిపించడం లేదు, 


రాగాలొదిలిన మనసు మళ్లీ వచ్చి చేరిందా, లేదు కదూ అందుకే ఇప్పుడు నిశ్శబ్ద రాగం ఒక్కటే ప్రవహిస్తోంది, అలికిడించకు గుండె ఉలిక్కిపడటం ఆపేస్తుంది...


ఏయ్....

నిన్నే.... రాలేవు కదూ!? తెలుసులే నాకు, నే పంపిన మాటలతోనే నువ్వు కాలక్షేపం చేస్తూ నన్ను వీసమెత్తు కూడా పట్టించుకోవడం మానేశావని, నే రాసిన చూపులలోనే చిక్కుకుపోయిన నువ్వు తప్పించుకు వచ్చి నన్ను చేరడం మరచావని


అయినా....

ఎందుకింత కలవరం, చెప్పూ ఇవాళో, రేపో, నీకు నువ్వుగా వస్తావుగా , నిన్ను గుర్తుంచుకున్న నన్నొక్కింత హేళన చేయడానికి, నీ ధ్యాసలో మరచిపోయిన నన్ను నాకు గుర్తుకు తేవడానికి.....


సుధా


Rate this content
Log in

Similar telugu poem from Abstract