STORYMIRROR

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

స్టుపిడ్

స్టుపిడ్

1 min
428

పరిచయాలూ పలకరింపులూ

గతం గతః

అభిమానాలూ ప్రేమలూ

అరె పిచ్చోడివా నువ్వు


ఇది ఇప్పటి కాలం

కురవాలంటే కురవడం

వెలవాలంటే వెలవడం


చోటు చోటులో నీకో చోటుందని వెతకకు

వెదలే వెల్లువలు

నిన్నలా రేపూ ఉంటుందని మురవకు

మరపు మానవ సహజం


తీరిగ్గా తలచుకునేందుకు

నువ్వేమన్నా రేపటి తల దగ్గరి దీపానివా

లేదా నిన్నటి ఉమ్మనీటి ఆవిరివా

పో పో ఓయ్

మాదంతా కత్తిమొన మీద నిలిచిన జీవితం


Rate this content
Log in

Similar telugu poem from Abstract