*గురువు*
*గురువు*
గురువు,
మన మెదడుకి ఎరువు,
మాకు పాఠాలు ఎన్నో నేర్పించారు,
సంస్కారంగా ఉండేలా తీర్చిదిద్దారు,
అజ్ఞానం గా ఉన్న మాకు విజ్ఞానశాస్త్రాన్ని బోధించారు ,
చరిత్ర లేని మాకు ,
చరిత్ర పాఠాలు వినిపించి,
చరిత్ర గొప్పతనాన్ని వివరించారు,
ఈనాటి బాలలను రేపటి పౌరులు గా తయారు చేశారు,
అబ్దుల్ కలాం ,గాంధీజీ, లాంటి వారిని సృష్టించారు,
గురువులకు ఏమిచ్చ తీర్చుకోగలం రుణం,
ఇదే మాకు దేవుడిచ్చిన వరం.