STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

చెదపురుగు

చెదపురుగు

1 min
335


*******************

వేరుపురుగు వృక్షాన్ని చెరిస్తే

చీడపురుగు చెట్టును చెరుస్తుంది

కాని స్వార్థం,అహం,

నాది నేనను పలు రూపాలు

మనిషినావహించు చెదపురుగులు 


అణువణువు ఆవాహనమై

మస్తిష్కం మొద్దుబార్చి

నిలువునా నాశనం చేస్తుంది

బంధాలను బలహీనం చేసి

శత్రు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి

నిలువనీడను లేకుండా చేసే

అత్యంత ప్రమాదకరమై

ప్రాణాలను హరించేస్తుంది

గుప్పిట జారిన ఇసుకలా

జీవితం చేజారిపోతుంది


కోపమనే శత్రువును జయించి

శాంతమనే చిత్తమును కలిగి

మేలు చేయక పోయినా

కీడు తలపెట్టని నాడు

ఏ చెదపురుగు దరి చేర

సాహసించదు



Rate this content
Log in

Similar telugu poem from Abstract