STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఈ ఏకాంతం

ఈ ఏకాంతం

1 min
4


నీవిచ్చిన అందమైన..బహుమతి ఈ ఏకాంతం..! 

మనసు కథలు నీ జతలో..రాల్చడమే వేదాంతం..! 


కడలిపొంగు చిన్నదికద..చెలియకంటి ఊటముందు.. 

వెర్రిప్రేమ గొడవతోటి..మిగిలేనా రాద్ధాంతం..! 


లెక్కలెలా కట్టగలవు..ఆకసాన తారలెన్నొ.. 

వెతుకులాడ దొరికేనా..ఒక మిహురుని సిద్ధాంతం..! 


గాలిపటం దారమెపుడు..తెగిపడునో తెలిసిరెవరు.. 

గగనాలను దాటువిద్య..అందినపుడే సుఖాంతం..! 


సరికొత్తగ ప్రతిరేణువు..ప్రగతిగీతి పాడుతోంది.. 

జరుగుతోంది కణకణమున..అనవరతం మోహాంతం..! 


కోటిదిశల పరుగుతీయు..ఊహకన్న తియ్యనేది.. 

కలలవీధి మెఱుపులతల..పొందులోన నాట్యాంతం..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance