తడి జ్ఞాపకం
తడి జ్ఞాపకం
చూరుకు వేలాడే చిరునవ్వులు నేడు చితికిపోయిన ఆనందాలు
గాయపడ్డ జీవన చిత్రాలే గతితప్పిన బ్రతుకు యాత్రలు
అందమైన అతియోక్తులేవీమనసును స్పర్శించడంలేదు..
అరుదైన సంఘటనలేవిసంతోషాన్నివ్వడంలేదు
నిరంతర ప్రశ్నలకునిట్టూర్పులే సమాధానాలు
నిత్యమైన చీకటి వెలుగులకుఙ్ఞాపకాలే ఆధారాలు
నిశలు రాల్చే ఆలోచనలునిశ్శబ్ద భావనలుగా
మనసు తడులుఅక్షరాలను అన్వేషిస్తున్నాయి....!!

