నీ కన్నుల
నీ కన్నుల
కలలుగనే మేఘత్వం చూస్తున్నా నీ కన్నుల..!
మెరుపు రథం శుద్ధత్వం చూస్తున్నా నీ కన్నుల..!
చిత్రమైన కావ్యాలకు పుట్టిల్లది నీ తలపే..!
కవ్వించే రాగత్వం చూస్తున్నా నీ కన్నుల..!
మనసు పొరలు కరిగించీ నను మాయం చేస్తావే..!
పాలించే గగనత్వం చూస్తున్నా నీ కన్నుల..!
నన్ను నీవు మనువాడిన వేళ ఎంత అద్భుతమో..!
లాలించే మాతృత్వం చూస్తున్నా నీ కన్నుల..!
కనులు మూసి మూయగనే మరపించే నెచ్చెలివే..!
ప్రవహించే స్నేహత్వం చూస్తున్నా నీ కన్నుల..!

