కొత్త కోరిక
కొత్త కోరిక


ప౹౹
కోరికా కొత్తగా ప్రారంభమయేను ఇంపుగాను
తీరాక పాత ముగింపూ చూపు సొంపుగాను
౹2౹
చ||
నవ్వించే నయనం పెంచేనుగ కొత్త కోరికలు
కవ్వించే తరుణం కోసమే వేచే అభిసారికలు |2|
మనసంతా వలపు మయమేగ ఈ సమయం
సొగసంతా ఎక్కి సాగెనే ఆ తలపుల హయం |ప|
చ||
పన్నీటి పలుకులే పులకరింతలై పురి కొలుప
సన్నటి కులుకులే సరి గమలై మదినే నిలుప |2|
ఎంతటి హాయి కలిగెనో ఈ మంద గమనమే
అంతటి కూరిమి గాలిలోతేలే చంద్రయానమే
|ప|
చ||
అధరం దాటి తేనెలజల్లు కురిసే కొత్త పలుకు
మధురం నిండి తనువే చూపే మత్తు కులుకు |2|
ఈనాటిదా ఈ బంధం కొత్తగా ప్రారంభించను
అది ముగింపేలేని పాతకథే మరి పరికించను
౹ప౹