భలే మనసు
భలే మనసు
మొన్న
నిన్ను చూసి
తెరిచీ తెరవనట్టు
అసలు
పట్టింపే లేనట్టుంది.
నిన్న
నిన్ను చూస్తూ
తెరిచి ఉంటే బాగున్నన్నట్టు
కొసరు
పట్టింపులు లోనైనట్టుంది.
ఈరోజు
నిన్ను చూస్తూనే
తప్పకుండా తెరిచే ఉండాలన్నట్టే
అసలు
వైబ్రేషన్స్ తో నిలబడినట్టుంది.
రేపటి సంగతేగా
ఇప్పుడు మాట్లాడుకోవాలి
తెరిచిన మనసుకు
తలుపులే లేకుండా చేయాలన్నట్టూ
అదే అనివార్యం అయినట్టే
తన సౌందర్యం
స్వప్నమై
కరిగిపోతుందనే భయాన్ని
హత్య చేసేయాలన్నంత కసికి
రక్షణ కవచమవ్వాలన్నట్టే తీర్చుకోవాలంది
నిజంగా
మనసు గాయాన్ని కోరుకోదు,
గాయం అవ్వకుండా
ఎంత ప్రయత్నం చేస్తుందో కదా

