తొలి ఉషస్సు
తొలి ఉషస్సు
తోలి ఉషస్సు మనసుని ఆహ్లాదపరచి
కాగితంపై కలం పెట్టమంటుంటే
అందమైన పువ్వులు నాపై కవితరాయి నాపై కవిత
రాయి అని కవ్విస్తుంటే
శ్రీవారు అందించిన ఫిల్టర్ కాఫీ వాసన నాసికలకు గుప్పుమని తగలగానే!!
అక్షరసంద్రంలో ఉవ్వెత్తున ఎగసి పడింది ఒక కెరటం
పదాల పదనిసులతో భావాల భావకతతో నన్ను తడిపి ముద్ద చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊసులు ఎన్నో చెప్పింది!!
పువ్వులగా సుందర సుకుమార పదాలను
కాగితంపై పరుగులు తీయించి
అక్షరాలా సాగును అవలిలగా చేయించి
కవితపు పంటను కానుకగా ఇచ్చింది
నను కవయిత్రిని చేసింది...

