నీ వాలు చూపు
నీ వాలు చూపు
విసరకే నీ వాల్చూపు విరి వల నాకై విసరకే
వొంపకే నీ వాల్జడల వాలువిల్లు నాకై వొంపకే
కొసరకే నీ కొంగుముడి కులుకు నాకై కొసరకే
కసరకే నీ నునిబుగ్గల నిగ నిగలే నాకై కసరకే
తిప్పకే నీ నదుమొంపు తిరగలి నాకై తిప్పకే
తూపకే నీ తుంటరి తొణుకులు నాకై తూపకే
అలగకే నీ లాలిత్యపు లతలతో నాకై అలగకే
అలుకకే నీ నవ్వుల నెత్తావులు నాకై ఆలుకకే
చూపకే నీ లిల్లి మల్లియ ఘుమ నాకై చూపకే
చాపకే నీ గోరువంక గోరింట గుట్టునాకై చాపకే..!!

