నీకోసం ఎదురు చూపు
నీకోసం ఎదురు చూపు
తీసియున్న వీధితలుపు..వేయాలని లేదోయి..!
నీవు రాక నీళ్ళైనా..త్రాగాలని లేదోయి..!
గాలి జాలి చూపి కాస్త..తెలుపదాయె నీ జాడ..
నీకోసం గాక అసలు..బ్రతకాలని లేదోయి..!
గండిపడిన గుండెచెరువు..వరదనెలా ఆపాలి..
చెక్కిలింటి నుండి చుక్క..రాల్చాలని లేదోయి..!
కొడిగట్టిన దీపంలా..ఉన్నదిపుడు నా మనసు..
నా బాధను ఒకలేఖగ..పంపాలని లేదోయి..!
శ్వాసకెంత కష్టమౌనొ..నీతోడే లేనపుడు..
నీ ఎదపై గాక కన్ను..మూయాలని లేదోయి..!
కవ్వించే వసంతాల..అలజడెంత మధురమో..
కోర్కెలతో యుద్ధమింత..చేయాలని లేదోయి..!

