ఓయ్ హితుడా
ఓయ్ హితుడా
ఆల్చిప్పలోని ముత్యo ఎంత వింత కూర్పో
నీవు అంతటి కూర్పుగా సృష్టించపడ్డావేమో...!!
అందుకే నాజ్ఞాపకాల దొంతరలు
నీవెన్నడూ కాళీ చేయలేవు.....!!
మాసి పోయే రాతలు కావు
వెలసిపోయే రంగులూ కావు...!!
మెరిసిపోయే చుక్కల్లా
అందంగా అల్లుకుంటాయి తెలుసా నీఊసులు ....!!
నీవు నేనుగా నేను నీవుగా
ఇద్దరమధ్య ఒకటే ప్రేమగా.....!!

