అమావాస్య చంద్రుడు
అమావాస్య చంద్రుడు
ఆకాశపు వీధిలో అలంకరించుకున్న కన్యపిల్లల్లా
బారులు తీరిన చుక్కల కన్యలు
మేఘమాలికలు మెరుపు తీగలైహొయలు
పోతూ వెలుగుతున్నవేళా
వీచే గాలిలో నవ్విన పువ్వుల సుగంధాల
గుభాళింపు అలలుగా తెలియాడు వేళా
నిశిరాతి నీకోసం నే నీడనైచూపులన్నిటిని
క్షణాల కొక్కానికి తగిలించిఎదురు చూస్తున్న వేళా
నీ తలపుల సనుగుడులో మదనపడే
మనసును సముదాయిస్తూ
పరుగెడుతున్న నీ ఆలోచనల గుర్రాలకు
నిట్టూర్పులతో కల్లాళ్ళు బిగిస్తూ
నీ కబురే తెలియని గుండె ఊపిరాడని ఉక్క
పోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే
దిన దినం ఆకసాన అదృశ్యమయ్యేఅమావాస్య చంద్రుడిల్లే
నువ్వు నా నుండి దూరంగా జరుగుతుంటే
ఒడ్డున పడ్డ చేపలా గుండె గిల గిల కొట్టుకుంటోంది
జాబిలి కై వేచిన కలువలా నీ నిరీక్షణలో నే ఉంటున్నా
నిండు చంద్రుడై నా మనసాకాశంలో ఉదయిస్తావని
మోసు వేసిన మన ప్రేమ మొలకను వడలనీయక
హృదయపు నేలలోబ్రతికించుమాలినై
నేను ప్రాకారమౌతానుపరిమళించే
అనురాగాలను పండించుకుందాం బ్రతుకునిండుగా...

