మధుర భావాలు
మధుర భావాలు
మదిలో దాగిన మధుర భావాలు
ఒక్కసారిగా ఇలా సందడి చేస్తుంటే
నీ ఊహలన్ని అమాంతం
నన్ను చుట్టేస్తుంటే
ఉండబట్టలేక హృదయం
ఏదో రాగం ఆలపిస్తుంటే
అదే పనిగా నువ్వు గుర్తొస్తుంటే
కనులకు అసలు కునుకన్నదే రాకుంటే
ఎపుడెపుడూ చూస్తానా అని
మనసెంతో ఆరాటపడుతుంటే
నీకోసం వేయి కన్నులతో
ఎదురుచూస్తుంటే
ఇకనైనా రావేలా నవవసంతలా
చిగురింపజేయవేలా సరికొత్త ఆశల్ని

