ప్రియా సఖియా
ప్రియా సఖియా
ప్రియ సఖియా!
ఏమని కవిత వ్రాయను నేను, ఏమని భావన చేయను నేను , ఏమని అక్షరాలు వెతకను నేను, నిను వర్ణన చేయడానికి అర్ధం కావడం లేదు, అక్షరం దొరకడం లేదు, కాలం కదలడం లేదు, నా కను రెప్పలు పడడం లేదు, కలం కాగితంను కౌగిలి చేయడం లేదు!
అరిటాకు లాంటి అందం, కరి మబ్బుల కురులు, వన కన్య వగలు, అలసిన సూర్యుడు బిందువులా మారి నీ బొట్టు ల నీ నుదుటి సిందూరమైనట్లు!
తలుక్కు మనే తార నీ ముక్కెర అయినట్టు, చెమక్కులు చేసే చేమంతులు నీ చెవి దిద్దులుగా అడ్డుకొన్నట్లు , నాగ భైరవి నగ దండలు నీ ఖంఠం మీద కదులునట్లు!ఆకాశ గంగ బిందువు బిందువు దండగా మారి నీ రవిక లేని రస సంపద మీద జాలువారుతున్నట్లు, మట్టి గాజులు మహా సరదాగా నీ చేతికి అలంకరణతొ అలజడి, జల సవ్వడి చేస్తున్నట్టు!
అంతులేని అగాధం నీ నాభి లోకమై లోచన చేస్తున్నట్లు, నిలుద్దామా, కదులుద్దామా అనే మేఘం నీ మేము మీద పమిటగా పదనిసలు పలుకుతున్నట్లు!
ఏమి హొయలు, ఏమి లయలు, ఏమి కాంతులు, నీ కంటిలో ఎన్ని సుఖానుభావాల కథలు, నీ నా గుర్తుకు వచ్చే మధుర గమకాలు నీలొ ప్రదర్శితం అవుతున్నాయి!
అందమైన జీవితం, అద్భుతమైన రూపం, కడలి అలల వంటి అనుభవం, తీరని, తీరం చేరని తీపి విరహవేదనతో విచిత్రంగా విరిసే సన్నని ధరహసం అధరాలను అద్దినట్లు!
కొన్ని నిముషాల నీ సంగమం, సాగరమంత అనుభవం, ఆకాశమంతటి అనుబంధమైనట్లు వున్నదే!
అలా కాలం కలిపి, ఇంతలో ఇంత దూరం జరిపి, ఆలోచనలతో జాతర చేస్తున్నట్లు వున్నదే!
ఋతువు పునరావృత్తి ఐనట్లు, మరల నీ నా కలవరం కదలి కదలి,
ఎదను మీటినట్లు, కాలం కరిగి, దూరం తరిగి, తలపులు తలుపులు తెరిచి నిను చేరే రోజు వచిన్నట్లు, నేను నీ చెంతలో చేతిలో నలిగినట్లు!.
ప్రకృతిని మొత్తం నీలో చూస్తున్నట్లుంది, నన్ను నేను కోల్పోతున్నట్లు వుంది, నీ దగ్గర తనం నా అస్థిత్వానికి పెను సవాలు విసురుతుంది! నీ కురులతొ పట్టి నీ ముందుకు నిలుపుతున్నట్లు!
... సిరి

