నిన్నువదలి వెళ్ళడమే
నిన్నువదలి వెళ్ళడమే
నిన్నువదిలి వెళ్ళడమే..చేతకాదు ఏంచేయను..!
జ్ఞాపకాల మూట విసర..వల్లకాదు ఏంచేయను..!
ప్రేమన్నది ఆకర్షణ..అంటారే మతవాదులు..
నీవులేని బ్రతుకేమో..తలచకాదు ఏంచేయను..!
పిలువకలా మరలమరల..మదిని వాన చూపలేను..
నీ కన్నుల తడియన్నది..చూడకాదు ఏంచేయను..!
నా మనసే నీ పూజా..మందిరముగ మారినదే..
ఇంతకన్న మాటలలో..చెప్పకాదు ఏంచేయను..!
ఉత్తరాలు వ్రాయగాను..నేర్వలేదు అక్షరాలు..
గుండెబరువు ఏ తీరుగ..మోయకాదు ఏంచేయను..!
మధువెక్కడ దొరికేనో..నీ చూపుల మాటుగాక..
నీ బొమ్మను కలనైనా..చెరుపకాదు ఏంచేయను..!

