గుండె కైన గాయం కధ
గుండె కైన గాయం కధ
గుండెకైన గాయంకథ..చెప్పాలని లేదు..!
ఒక అశ్రువు మాటు ఘోష..పాడాలని లేదు..!
ప్రేమకన్న వేదించే..సంగతేమి టసలు..
ఈ విరహపు కడలినింక..మోయాలని లేదు..!
వెన్నెలింటి మంచువాన..అగ్గిలాగ మారె..
బరువెక్కిన ఈ శ్వాసను..నిలపాలని లేదు..!
కఠినశిలయు కరుగునేమొ..నీ మనసది ఏమి..
అయోమయమెంత హాయో..ఓపాలని లేదు..!
వ్రాయరాని కావ్యమనగ..మనతియ్యని చెలిమి..
అక్షరాల పంజరమున..ఉంచాలని లేదు..!
నీ కోసం కలవరించు..పూలతోట మనసు..
నీవురాక చిగురైనా..తొడగాలని లేదు..!

