ఇదేమో
ఇదేమో
తరుముతున్న కలలరేయి..ప్రభావమే ఇదేమో..!
తనసిగలో నెలవంకల..విలాసమే ఇదేమో..!
కురులవీణ మీటుతున్న..పిల్లగాలి నడగాలి..
ఎదలోయల మరులజల్లు..సరాగమే ఇదేమో..!
కనుపాపల నాట్యాలకు..తాళమేమి వేయునో..
గుండెలయల మౌనహాస..విరూపమే ఇదేమో..!
అనుక్షణం తోడుండే..చెలిమినదే ఆ చూపు..
మైమరపున నను నిలిపే..ప్రవాహమే ఇదేమో..!
ప్రతి ఊహకు ప్రేమమీర..ప్రాణాలను నింపునే..
ఒక సాక్షిగ తను జరిపే..వినోదమే ఇదేమో..!

