ప్రళయమే వచ్చే
ప్రళయమే వచ్చే
వర్షించే మేఘమా ఓ.. ఓ.. మేఘమా..
నేలను ముద్దాడగ వచ్చావమ్మా విడువని వానై
చిత్తడి నేలల పచ్చని పైరుల సిరులను పండించగ వచ్చావమ్మా విడవని వర్ష మై
నెర్రలు తీసి తూట్లు పడ్డ భూమాతను
గొంతు తడుపగా వర్షించావమ్మా విడవనివర్షమై
కామాంధుల చేతుల్లో చిన్నా భిన్నం అయ్యిన
మగువల రుధిరంతో రక్త శిక్తమై తడిచిన
అవనిని ప్రక్షాళన చేయగ నింగి కన్నీటి ధార లై
విడవని వర్షం లా బోరున విలపి స్తున్నావా
అసహాయు లై దిక్కులు చూస్తున్న అతివ
మాన ప్రాణాలను కాపాడగ పెళ పెళ ధ్వానాల
దిక్కులు పిక్కటిల్ల నల్లని మేఘాల కురులను
నింగినెల్ల విదిల్చి ఎర్రని కళ్ళలో మెరుపులు
కురిపిస్తూ రుధిర నేత్రమే తెరచి పిడుగులే కురిపించే విడువని కుండపోత వర్షమై కురిసే
వాగులు వంకలే పొంగి ప్రళయం మే వచ్చే…

