ప్రేమ ఎంత మధురం
ప్రేమ ఎంత మధురం
మెఱుపుమల్లె చెండులాగ..నవ్వింది తానే..!
అందమైన పాటలాగ..మిగిలింది తానే..!
గుండెలోని ఊపిరికే..ఊపిరియే ఎపుడూ..
మదిని ఇంద్రధనువు లాగ..మలచింది తానే..!
ప్రేమ ఎంత మధురమో..తెలుపకనే తెలిపెనె..
ఏకాంత మందిరమే..చేర్చింది తానే..!
అక్షరాల మౌనమధువు..ఒంపుతోంది సరిగా..
ఆ సరిగమల మూలాన..నిలిపింది తానే..!
వినిపించని ఆ అందెల..సవ్వడే మధురం..
తీపివలపు ఊయలయే..వేసింది తానే..!

