నా ప్రాణం...
నా ప్రాణం...
నీకళ్ళల్లోకి చూడాలంటే...
సూటిగా చూడలేక...
ఉన్నచోట ఉండలేక...
దూరంగా వెళ్ళలేక...
ఆగలేక... సాగలేక...
తాళలేక... తాకలేక...
ఆర్తినై... ఆశనై...
మూగనై... మౌనగానమై...
రాయినై... రాధనై...
పరిపరివిధాల తల్లడిల్లి...
తపించి... జపించి...
నీవెళ్ళిన దారిలో...
నా మనసునంపించాను...
నీ కుశలమడగమని...
నీకు తోడైఉండమని...
నా ప్రాణం నీలోనే ఉందని...
అదినీకు చెప్పాలని...

