నా సుందరి...
నా సుందరి...
నీ తనువే నీలం..
నీ పలుకే పగడం...
నీ నడకే ముత్యం
నీ నడతే వజ్రం
నీ కులుకే కనకపుష్యరాగం...
నీ మురళీగానం వైఢూర్యం...
నీ మోమున నగవు కెంపు...
నీ సాహచర్యేచ్చే పచ్చ..
నీవు గోవర్ధనగిరినెత్తిన తీరు గోమేధికం. .
నవరత్నాల సొబగులు కూర్చిన...
వన్నెలుచిన్నెలు నీ సొంతం...
నీ మనసే బంగారం
కదామరి నా శ్యామసుందరా...!!

