ఊహల పల్లకి...
ఊహల పల్లకి...
నీ నవ్వుల జాబిలీసాగి పోయే ఊహల పల్లకి ..
నీ మనసు ఓ పూలవనం పరిమళించే వెన్నెల చల్లదనం...
నీ గుండె చప్పుడు మ్రోగించెను లే నా గుడిగంటలు..
నీ నడక సవ్వడులు తెలిపెనులే నా చెలి రాకకై...
నీ కనుల కదలికలునన్ను మైమరపించే ఊహల కళలు ....
నీ కాలి మువ్వలు రమ్మని చెప్పేనులే నీ దరి చేరుటకు......
నీ చెవి రింగులా మదిని దోచే మయపు ఎరలు.......
నీ కన్నుల కాటుక చుక్కలు మన ప్రేమకు పెట్టిన దిష్టి చుక్క .....
నీ పెదాల తేనె పలుకులు గుర్తు తెచ్చెనులే
బుజ్జీ పాపాయి బుజ్జగింపులు,.....
నీ వాలు కురుల నా పైన కురిసే చంద్ర కిరణాలు...
నీ ప్రేమ కోసమే నా సఖియానిన్ను పొందేదాక
ఓ చెలియావేచి చూస్తానే ఎందాకైనా...
నీ రాకకై ఓ చెలి పడతానే ఓపిక నా శ్వాస వుండే దాక....

