లీలా...
లీలా...
అలల అలల చెలరేగు గాలి తెరలా
వలల అల్లికల తారల మరినటులా
ఆ నింగిలోని నిశిధార నేల జారుతున్న ఈ వేళ
మిణుకు మిణుకు మిణుగురులా కాంతల్లెనేమో ఈ నేల
ఆ కలల తలుపు తెరిచేలా ఎద శంఖమూదెనే ప్రతిధ్వనించేలా
రెపరెపలాడు రెక్కలే నిదురమ్మ ఒడిని చేరేనిలా
గుసగుసలాడు మలయమారుతంముంగురులనే తడిమేనలా
పలుచబడిన వెన్నెల వాన కురిసే నవమి సిరిలామంద్రంగా సాగుతుందే
నా పాట జోలలామత్తేదో గమ్మత్తు చేయగా
నిదుర కోరే నయనాల లాలి లాలీ పలకాలి ఈ రేయి
హాయి మురిపాల సెలవంటు వెలుతురులే మాయమైన లీల......

