నీవే...
నీవే...
రెప్పలు మూస్తే నీవే
కనులు తెరిస్తే నీవే
కలలలోనూ నీవే
నిదుర చెరిపేస్తావే
అడుగు వేస్తే నీవే
మరుపు రానే రావే
పరుగు పెట్టిస్తావే
అలక బూనేస్తావే
మనసు దోచేసావే
మమత పంచేస్తావే
మల్లెలు తురిమేస్తావే
మరులు గొల్పిస్తావే
మాయలు చాలించి ఇటు రావే
నిలువలేకున్నాను వరమీయ రావే
బంగారు కొండవే ఏడ దాగున్నావే...

