జీవితం...
జీవితం...
నీటిబుడగ జీవితంలో
నవ్వేదంతా నిజమూ కాదు
కన్నీళ్ళున్నవీ అబద్దమూ కాదు
గాలికి రెపరెపలాడే తెరచాప నావలో
చూసేదంతా ఆనందమూ కాదు
పొందేదేదీ శాశ్వతమూ కాదు
జీవితకాలం కోరే ప్రేమలో
క్షణకాలం మాత్రమే తళుక్కున మెరుస్తుంది
కనుమూసి తెరిచేలోపే జ్ఞాపకంగా మారిపోతుంది
మరణం వరకూ మిగిలిపోతుంది
నీ ప్రేమ లో ఇలా తేలిపోతూంటుంది నా మనసు...

