ఈ చిరునవ్వు...
ఈ చిరునవ్వు...
నీ అందమైన మనస్సులో నా మధురమైన జ్ఞాపకం ఎందుకో
మేలి ముసుగున నీ కొంటె నవ్వుతో నాపై అల్లరి ఎందుకో
అలిగిన నీ మోముపై చెప్పలేని ఈ అనురాగం ఎందుకో
నీ చిలిపి చూపుల కవ్వింతలలో నాలో
ఈ తుళ్ళింతలు ఎందుకో
నుదుటి పైన అల్లరి చేసే ఆ ముంగురుల కులుకులు ఎందుకో
నన్ను చూడగానే నీ చూపులో తెలియని తత్తరపాటు ఎందుకో
నీ అడుగుల సవ్వడిలో నాలో మెదిలే మధురిమలు ఎందుకో
నాకై వెదికే నీ కళ్ళలో ఆ తీయని కలవరపాటు ఎందుకో
తెలిసీ తెలియని అమాయకత్వంలో నా మైమరుపు ఎందుకో
నీ ముగ్ధ మోహనరూపం నన్ను పరవశింపజేయడం ఎందుకో
నా అడుగు నీతో కలిసేటప్పుడు నాలో కలిగే గిలిగింతలు ఎందుకో
నిన్ను తలచిన ప్రతిసారి నాపెదవులపై ఈ చిరునవ్వు ఎందుకో.......

