నీ వల్లే...
నీ వల్లే...
మనసులో కలవరం
నీవల్లే
గుండెలో గుబులు
నీవల్లే
వయసులో పరవశం
నీవల్లే
సొగసులో తళుకులు
నీవల్లే
పెదవులలో చిరునవ్వు
నీవల్లే
కన్నులలో మెరుపులు
నీవల్లే
మోములో సిగ్గులు
నీవల్లే
మాటలలో మధురిమలు
నీవల్లే
పున్నమిలో చంద్రుడివై
ప్రకాశిస్తూ
వెన్నెల రేయిలో
వెండిపూల వానను కురిపిస్తూ
అందమైన కలలను కనులకు చూపిస్తున్న వేళ
నీ ఎదలో సొదలన్ని విని
నీ మదిలో మౌనాన్ని కని
అపుడే విరబూసిన పూవుల
పరిమళాన్ని మదిలో భావాలకు అద్ది
అందమైన కావ్యంగా మలిచి
ఆ కావ్యాన్ని పూలమాలగా మార్చి
నీ మెడలో వేయగరానా
నీ ఎదలో ఎప్పటికీ కొలువుండిపోనా

